ఎస్ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్లలో కట్టడి ముట్టడి తనిఖీలు బక్రీద్ నేపథ్యంలో అక్రమ రవాణాపై పోలీసుల ప్రత్యేక నిఘా

నేరేడుచర్ల, మే 27,శుభోదయ డైనమిక్ వార్త బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్ల పోలీసులు విస్తృతంగా కట్టడి ముట్టడి, నాకాబంది తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిల్లపల్లి బ్రిడ్జ్ వద్ద ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రతి వాహనంపై క్షుణ్ణ పరిశీలన తనిఖీల్లో భాగంగా ప్రతి వాహనాన్ని ఆపి పూర్తిస్థాయిలో తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పశువుల అక్రమ రవాణాతో పాటు పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. అనుమానితుల కదలికలపై నిఘా అక్రమ రవాణా, అసాంఘిక...