డయల్ 100 కాల్స్‌పై సూర్యాపేట పోలీసుల మెరుపు స్పందన సగటున 10 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుతున్న పోలీసు బృందాలు

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, మే 26 సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డయల్ 100 ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు డయల్ 100కు కాల్ చేసిన వెంటనే పోలీసులు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందిస్తున్నారు. రికార్డు స్థాయిలో స్పందన జిల్లా వ్యాప్తంగా సోమవారం వచ్చిన డయల్ 100 ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది సగటున 10 నిమిషాల్లోనే స్పందించి బాధితుల వద్దకు చేరుకున్నారు. ఘటనాస్థలాల్లో తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచారు. ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ 3...