ప్రయాణ సమయంలో అప్రమత్తత తప్పనిసరి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : జిల్లా ఎస్పీ నరసింహ

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, మే 26 ప్రజలు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపురం స్టేజి వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలి ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణ లోపాలు, పొదలు, అడ్డంకులు లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి...