గిరిజనుల మహా ధర్నాను విజయవంతం చేయాలి ఈనెల 26న “చలో హైదరాబాద్”కు భారీగా తరలిరావాలని పిలుపు

గరిడేపల్లి, మే 22 ,శుభోదయ డైనమిక్ వార్త ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న “చలో హైదరాబాద్” మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి కేంద్ర కమిటీ సభ్యుడు బానోతు వెంకటరామ్ నాయక్ పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండల కేంద్రంలో గిరిజన నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన, అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా గిరిజనులకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం లంబాడీలకు ఇచ్చిన 12 హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు రాజకీయంగా...