ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక ఆకర్షణగా సూర్యాపేట జిల్లా పోలీస్ స్టాల్ పోలీస్ స్టాల్‌ను సందర్శించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, మే 22, శుభోదయ డైనమిక్ వార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని రవి మహాల్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తమ శాఖల ప్రగతి అంశాలను ప్రదర్శించాయి. అవగాహన కార్యక్రమాలతో ఆకట్టుకున్న పోలీస్ శాఖ ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం, మహిళా భద్రత, పిల్లల రక్షణ, మాదకద్రవ్యాల...