పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ నిరసనలు హాస్యాస్పదం: పంగులూరి అంజయ్య ఉనికి కాపాడుకునేందుకే వైసీపీ ఆందోళనలు చేస్తున్నారని విమర్శ

కారంపూడి, మే 19 ,శుభోదయ డైనమిక్ వార్త పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు చేపడుతున్న నిరసనలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీ చైర్మన్-4 పంగులూరి అంజయ్య విమర్శించారు. మంగళవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ధరలు పెరిగినప్పుడు ఎందుకు మౌనం? 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా అప్పట్లో ఒక్క మాట కూడా మాట్లాడని నేతలు, ఇప్పుడు నిరసనలకు దిగడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కాదని, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు...