తాటిచెట్టుపై విద్యుత్ షాక్‌తో గీత కార్మికుడు మృతి చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత కన్నుమూత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువుల విజ్ఞప్తి

హుజూర్‌నగర్, మే 19 ,శుభోదయం డైనమిక్ హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాలనీకి చెందిన గీత కార్మికుడు దాసు సైదులు (46) విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తాటిచెట్టు ఎక్కిన సమయంలో ప్రమాదం కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసు సైదులు ఈ నెల 12వ తేదీన చింతలపాలెం మండల కేంద్రంలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో కాలుజారి చెట్టు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అనంతరం చెట్టు పై నుంచి కిందపడిపోయి అపస్మారక...