విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యా విజయోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు ఉన్నత విద్యతోనే మంచి అవకాశాలు సాధ్యం : కలెక్టర్
నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,మే 17 భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “విద్యా విజయోత్సవం” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించి, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతులను అందజేశారు. అలాగే కేజీబీవీ, మోడల్ స్కూల్‌లకు చెందిన 5 మంది విద్యార్థులు, స్పోర్ట్స్ స్కూల్‌కు...