సుందరయ్య నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ 65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు సీజ్ – నలుగురు అనుమానితుల గుర్తింపు
సూర్యాపేట బ్యూరో, మే 17,శుభోదయ డైనమిక్ వార్త శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులు, చోరీకి గురైన వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతి పత్రాలు లేని వాహనాల సీజ్ తనిఖీల సందర్భంగా పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని...