బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలి నేరేడుచర్లలో బి ఆర్ ఎస్ నేతల డిమాండ్
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,మే 11 నేరేడుచర్ల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 48 గంటలు గడిచినా అరెస్ట్ చేయకపోవడం దారుణం ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ, లైంగిక వేధింపుల కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ 48 గంటలు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం చట్ట విరుద్ధమని విమర్శించారు. చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు....