రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్‌గా దొంగరి వెంకటేశ్వర్లు హృదయపూర్వక అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

శుభోదయం డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మే 9 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంగరి వెంకటేశ్వర్లు రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి అభినందించారు. నివాసంలో మర్యాదపూర్వక భేటీ ఈ సందర్భంగా పీసీసీ జాయింట్ సెక్రటరీ చామకూరి శ్రీధర్ గౌడ్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మామిడి వెంకన్న గౌడ్, చెవుగోని రామాంజనేయులు, పల్లె వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా గోప అధ్యక్షులు (గౌడ్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్) దంతూరి సైదులు గౌడ్ తదితరులు వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లి శాలువాతో...