జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా చలసాని శ్రీనివాసరావు నియామకం

నేరేడుచర్ల, మే 5,శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన చలసాని శ్రీనివాసరావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సేవలకు గుర్తింపు చలసాని శ్రీనివాసరావు మరియు ఆయన కుటుంబ సభ్యులు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య ప్రతిపాదనతో ఈ నియామకం జరిగింది. గత పదవులు – అనుభవం శ్రీనివాసరావు గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, చిల్లేపల్లి...