ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

నల్లగొండ బ్యూరో, శుభోదయ డైనమిక్, మే 4 జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. పాలనలో వేగం, పారదర్శకత, బాధ్యత పెంపొందించేందుకు ప్రజావాణి కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఆలస్యం జరిగితే గరిష్టంగా 30 రోజుల్లో పరిష్కారం చూపాలని, పరిష్కార వివరాలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయికి విస్తరణ ప్రభుత్వ ఆదేశాల మేరకు...