నీట్ (NEET) పరీక్షల సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కె. నరసింహ పరీక్షా కేంద్రాల వద్ద ఎస్పీ పర్యవేక్షణ

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, మే 3 సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా కళాశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను ఎస్పీ స్వయంగా సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. పోలీసు భద్రతపై ప్రత్యేక దృష్టి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా పత్రాల రవాణాలో అధికారులు, పోలీసుల మధ్య సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష సమయాల్లో...