దాడి కేసులో నలుగురు రిమాండ్ – మరికొందరి కోసం గాలింపు పర్యావరణవేత్తపై దాడి ఘటనకు మలుపు
శుభోదయ డైనమిక్ , మోతే, ఏప్రిల్ 27 మోతే మండలంలో పర్యావరణవేత్త, జలసాధన వ్యవస్థాపకుడు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకునే ప్రక్రియ వేగవంతం చేశారు. నలుగురిని రిమాండ్‌కు తరలింపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన బయ్య రోశయ్య, బయ్య గంగయ్య, భయ్యా మల్లయ్య, మేకల కృష్ణయ్యలను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సూర్యాపేట కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించి సూర్యాపేట జైలుకు పంపించారు. మరో ఐదుగురి కోసం గాలింపు దాడిలో మొత్తం తొమ్మిది మంది గొర్రెల కాపరులు పాల్గొన్నట్లు పోలీసులు...