డ్రగ్స్ నిర్మూలనకు వారం రోజుల అవగాహన కార్యక్రమాలు
సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్, ఏప్రిల్ 26 సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం సోమవారం నుంచి వారం రోజులపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. పిల్లల భద్రత–సమాజ బాధ్యత ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 5వ అంశమైన పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు పోలీసు సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించనున్నారు. మత్తు...