జనగణన–2027లో స్వీయ గణనకు నేటి నుంచే ప్రారంభం ప్రజలు ఆన్లైన్‌లో స్వయంగా వివరాలు నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, ఏప్రిల్ 26 సూర్యాపేట జిల్లాలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను నేటి నుండి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఆయన సూచించారు.ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరణ ఇచ్చారు. మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఏప్రిల్...