హుజూర్ నగర్‌లో రోడ్లపై వడ్ల రాశులు… ప్రమాదాలకు ఆహ్వానం– రాత్రివేళల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు – వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

హుజూర్ నగర్, ఏప్రిల్21,శుభోదయ డైనమిక్ హుజూర్ నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో డాంబర్ రోడ్డు మీదనే వడ్ల రాశులు పోసివేయడం తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పరిస్థితి వాహనదారులకు ప్రమాదకరంగా మారుతూ, ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై వడ్ల రాశులు – ప్రయాణానికి అడ్డంకి గ్రామంలోని ప్రధాన రహదారి మీద రైతులు వడ్లను ఎండబెట్టేందుకు రోడ్డు వినియోగించడం సాధారణంగా కనిపిస్తున్నా, ఇది రవాణా వ్యవస్థకు అడ్డంకిగా మారుతోంది. రహదారి మధ్యలో, పక్కలుగా వడ్ల రాశులు పోయడం వల్ల వాహనాలు సరిగా వెళ్లలేకపోతున్నాయి. రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం పగటి వేళల్లో కనీసం కనిపించే...