ఎత్తైన రహదారి – రైతులకు కష్టాల దారి
శుభోదయం డైనమిక్ న్యూస్, చిలుకూరు, ఏప్రిల్ 19 చిలుకూరు మండలంలోని గుట్టల ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల రహదారి స్థానిక రైతులకు సమస్యల ముప్పుగా మారింది. సాధారణ మట్టి రోడ్ల కంటే చాలా ఎత్తులో కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభనం భూమి స్థాయి కంటే ఎత్తుగా నిర్మించిన ఈ రహదారుల కారణంగా ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పంట రవాణా వాహనాలు పొలాల్లోకి చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా వరి కోత సమయంలో యంత్రాలు సులభంగా తిరగలేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చు పెరుగుదల – సమయం నష్టం పంటలను పొలాల నుంచి రహదారిపైకి...