హుజూర్ నగర్‌లో 24/7 మద్యం బెల్ట్ షాపుల దందాకుటుంబాలపై తీవ్ర ప్రభావం – అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
హుజూర్ నగర్,శుభోదయ డైనమిక్, ఏప్రిల్ 18 పట్టణంలో అక్రమ మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతూ సామాజిక సమస్యగా మారుతున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తూ అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికొదిలిన పరిస్థితి పట్టణంలో ఉన్న వైన్స్ షాపులు, బార్లకు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు నిరభ్యంతరంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలకు మద్యం విక్రయం బెల్ట్ షాపుల్లో ప్రతి క్వార్టర్‌పై అదనంగా రూ.40 వరకు, బీరు సీసాలపై రూ.30–40 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు...