టేక్మాల్‌లో సి.సి. రోడ్ల పనులకు శ్రీకారంమంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో నిధులు – సర్పంచ్ సుధాకర్ ప్రారంభం
టేక్మాల్, ఏప్రిల్ 16 శుభోదయ డైనమిక్ వార్త టేక్మాల్ మండల కేంద్రంలో రహదారి సమస్యల పరిష్కారానికి కీలక అడుగులు పడినాయి. చాలా కాలంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. మంత్రి చొరవతో నిధుల మంజూరు గ్రామంలోని రోడ్ల దుస్థితిని సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ మరియు పంచాయతీ ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేశారు. టేక్మాల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు....