శిథిలావస్థలో పశువైద్యశాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా జిల్లా అధికారులు!
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, ఏప్రిల్ 13 నేరేడుచర్ల మండల పరిధిలోని పెంచికల్ దిన్న గ్రామంలోని పశువైద్య హాస్పటల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నా, ఎలాంటి మరమ్మత్తులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం స్థానిక సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సమస్య తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన అధికారులు, కేవలం ఫైళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న అధికారుల వైఖరి ప్రతి రోజు భవనంలో స్లాబ్ ముక్కలు ఊడిపడుతుండగా, ఎప్పుడైనా ప్రాణ నష్టం...