నల్గొండలో భారీ పెట్టుబడి మోసం భగ్నం“VIPS” పేరుతో వందల కోట్లు వసూలు… “WAVE”గా మళ్లీ వల10 మంది అరెస్ట్… ప్రధాన నిందితులు పరారీలో
నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 12 అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన భారీ పెట్టుబడి స్కామ్‌ను నల్గొండ రూరల్ పోలీసులు బట్టబయలు చేశారు. “VIPS గ్రూప్ ఆఫ్ కంపెనీస్” పేరుతో వందల కోట్ల రూపాయలు సేకరించి, తిరిగి చెల్లించకుండా మోసం చేసిన ముఠా తాజాగా “WAVE” పేరుతో మళ్లీ వల వేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. లాభాల మాయాజాలం… పెట్టుబడిదారులకు నష్టం పుణేకు చెందిన వినోద్ తుకారాం ఖుటే 2016లో VIPS వాలెట్ యాప్‌ను ప్రారంభించి, 2018లో గ్రూప్‌గా విస్తరించాడు. సోషల్ మీడియా, ఏజెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ అధిక లాభాల ఆశ చూపి ప్రజల...