అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలేపాలకవీడు మండల కేంద్రంలో 199వ జయంతి వేడుకలు ఘనంగా

పాలకవీడు, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 11 సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల పురోగతికి విశేషంగా కృషి చేసిన మహానుభావుడని బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు అర్పణ ఈ సందర్భంగా నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలపై నిరంతర పోరాటం గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ, అంటరానితనాన్ని ఖండిస్తూ సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని...