అంతర్రాష్ట్ర ముఠా డీజిల్ దొంగలు అరెస్ట్ఆరుగురు నిందితులు అదుపులోకి – ఒకరు మైనర్
నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 11 జాతీయ రహదారులపై అర్ధరాత్రి ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40 లక్షల విలువైన సొత్తు స్వాధీనం నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్లపట్టాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. హైవేలపై గస్తీ పెంచి పట్టుకున్న పోలీసులు ఇటీవల...