పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలు వినియోగించుకోండి: సూపర్వైజర్ ధరణి

గరిడేపల్లి, ఏప్రిల్ 11, శుభోదయ డైనమిక్ వార్త ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ ధరణి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామ అంగన్వాడి కేంద్రం-06లో సేవా పక్వాడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోషకాహారం పై అవగాహన ఈ సందర్భంగా ధరణి మాట్లాడుతూ కుటుంబంలో నిత్యం వాడే ఆహార పదార్థాల ద్వారా సరైన పోషణ పొందవచ్చని తెలిపారు. ఆకుకూరలను స్వయంగా పండించుకునే విధానాలపై వివరించారు. రేషన్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌లో ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉండి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మేలుచేస్తుందని చెప్పారు. వివిధ ఆహారాల్లో పోషకాలు కందిపప్పులో మాంసకృత్తులు అధికంగా ఉంటాయని, రాగులు, నువ్వులు, వట్టి...