రైతులు ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమ సింగ్జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహణ

డైనమిక్ న్యూస్, మాసాయిపేట్, ఏప్రిల్ 10 మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు. పంటల వివిధీకరణపై దృష్టి వ్యవసాయ శాఖ ప్రగతిని సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంటల వివిధీకరణ (Crop Diversification) అత్యంత కీలకమని పేర్కొన్నారు. వరి వంటి సంప్రదాయ పంటలపై మాత్రమే ఆధారపడకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. దీని ద్వారా...