రబీ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అదనపు కలెక్టర్ కె. సీతారామరావు సూచనలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,ఏప్రిల్ 9 రబీ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కె. సీతారామరావు అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన గురువారం చివ్వేంల మండలంలోని రాంకోటి తండా, సూర్యాపేట మండలంలోని రాయినిగూడెంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితులను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే కొనుగోలు – మిల్లులకు తరలింపు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రస్తుతం తేమ శాతం, తాలు, తరుగు వంటి...