ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృత అవగాహన అవసరంకలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపు
సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,ఏప్రిల్ 9 ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. రెడ్ రన్ ర్యాలీ ప్రారంభం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు సందర్భంగా “AIDS అవగాహన నివారణ దినం”లో భాగంగా నిర్వహించిన రెడ్ రన్ ర్యాలీని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వరకు కొనసాగింది.ర్యాలీ సందర్భంగా “ఎయిడ్స్‌పై అవగాహన – జీవన రక్షణ”, “సురక్షిత జీవితం – ఆరోగ్య భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజలకు సందేశాలు అందించారు. బ్యానర్లు, పాంప్లెట్ల ద్వారా...