టేక్మాల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 42 మందికి రూ. 16.87 లక్షల ఆర్థిక సహాయం

టెక్మాల్, డైనమిక్ న్యూస్, మార్చి 7 అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 16,87,000 విలువైన చెక్కులు అందజేశారు. ప్రజలకు అండగా ప్రభుత్వం ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అవసర సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...