కన్నతల్లిని వీధిపాలు చేసిన కుమారులు – డైనమిక్ కథనంతో కదిలిన వ్యవస్థ

డైనమిక్ న్యూస్, మోతే, ఏప్రిల్ 4 మానవత్వం మరిచిన కుటుంబ కథనం మోతే మండలం నామవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన మానవత్వాన్ని సవాలు చేస్తోంది. 95 ఏళ్ల నల్లగంతుల వెంకటమ్మ (వెంకమ్మ) అనే వృద్ధురాలు, తన జీవితాంతంలో కుమారుల నిర్లక్ష్యానికి గురై వీధిపాలైన పరిస్థితి స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తల్లిని చూసుకోవాల్సిన ముగ్గురు కుమారులు ఆమెను పూర్తిగా విస్మరించడంతో, వృద్ధురాలు ఆహారం, ఆశ్రయం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్తి కోసం ప్రేమ – తర్వాత నిర్లక్ష్యం గ్రామస్థుల వివరాల ప్రకారం, 2021లో తల్లిని బాగా చూసుకుంటామని హామీ ఇచ్చిన కుమారులు, మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని తమ మధ్య...