కన్నతల్లిని పట్టించుకోని కొడుకులు – డైనమిక్ కథనంతో కదిలిన అధికారులు

డైనమిక్ న్యూస్, మోతే, ఏప్రిల్ 4 వృద్ధురాలి దుర్భర పరిస్థితి మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) తన జీవితాంతంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ, కనీస ఆహారం, సంరక్షణ లేకుండా ఆమెను బయటకు పంపించడంతో వీధిపాలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆస్తి పంచుకున్న తరువాత మారిన వైఖరి స్థానికుల వివరాల ప్రకారం, 2021లో తల్లిని బాగా చూసుకుంటామని హామీ ఇచ్చి, మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని ముగ్గురు కుమారులు పంచుకున్నారు. కానీ ఆస్తి పంచుకున్న తరువాత తల్లిపై ప్రేమ, బాధ్యతలు పూర్తిగా విస్మరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ ఆదేశాలు – అమలు కాని నిర్ణయాలు...