దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఏప్రిల్ 3 దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు. కొమురయ్య త్యాగం చిరస్మరణీయం: డీఎంహెచ్‌వో ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు....