కన్నతల్లిని పట్టించుకోని కొడుకులువృద్ధురాలు వీధిపాలై ఆవేదన వ్యక్తం

డైనమిక్ న్యూస్, మోతే, ఏప్రిల్ 2 మోతే మండలం నామవరం గ్రామంలో కన్నతల్లిని పట్టించుకోని కుమారుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు వీధిపాలైన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95)కు ముగ్గురు కుమారులు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య ఉన్నారు. భూమి పంచుకున్నాక తల్లిని నిర్లక్ష్యం 2021లో తమ తల్లిని చూసుకుంటామని చెప్పి మూడు ఎకరాల 9 గుంటల భూమిని ముగ్గురు కుమారులు పంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే అనంతరం తల్లిని సరిగా చూసుకోకుండా, అన్నం కూడా పెట్టకుండా బయటకు పంపించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ ఆదేశాలు అమలు కాని పరిస్థితి 2024లో బాధితురాలు సూర్యాపేట ఆర్డీఓను ఆశ్రయించగా, ప్రతి కుమారుడు నెలకు రూ.1500...