నేరేడుచర్లలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ క్యాంప్

నేరేడుచర్ల, మార్చి 29, డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాత నేరేడుచర్ల రామాలయం వద్ద ఆదివారం ఉచిత డయాబెటిస్ మరియు రక్తపోటు పరీక్షల శిబిరం నిర్వహించారు. క్యాంప్ ప్రారంభం ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, క్లబ్ పూర్వ కార్యదర్శి మరియు మున్సిపల్ కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షుడు గుండ్రెడ్డి సైదిరెడ్డి ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. సమాజ సేవే లక్ష్యం ఈ సందర్భంగా బట్టు మధు, దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమాజ సేవలో భాగంగా నిరంతరం ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. 75 మందికి ఉచిత పరీక్షలు...