వేసవి వేడి హెచ్చరికలు – పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక జాగ్రత్తలు
నేరేడుచర్ల, మార్చి 29, డైనమిక్ న్యూస్ రాబోయే వేసవి కాలంలో తీవ్ర ఎండల దృష్ట్యా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నేరేడుచర్ల మండల వైద్య అధికారి డా. పున్న నాగిని సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు ఉపయోగించుకోవాలని తెలిపారు. దుస్తులు, నీటి వినియోగంపై సూచనలు వీలైనంతవరకు తెల్లని, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదన్నారు. గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలని, సన్ క్రీములు, లోషన్లు...