సాదా బైనామా, భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశం
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 26 జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 76తో అఫిడవిట్ నిబంధన సడలింపు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో 76ను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇకపై సాదా బైనామా ప్రక్రియలో కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకునేలా నిబంధనలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. పట్టా భూములకే ప్రాసెస్ – 5 ఎకరాల లోపువారికి ప్రాధాన్యం...