రాఘవపురం–సిరికొండ రహదారి ఆక్రమణలు… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 26 మోతే మండలంలోని రాఘవపురం ఎక్స్ రోడ్ నుండి సిరికొండకు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో ఇరుకుగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డు పక్కనే బైకులు నిలిపివేయడం, చిన్నచిన్న గుడిసెలు ఏర్పడడంతో రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోయింది. దారి ఇరుకుగా మారిన పరిస్థితి సాధారణంగా సుమారు 50 మీటర్ల వెడల్పు ఉండాల్సిన రహదారి ప్రస్తుతం 10 మీటర్లకూ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా రావడానికే కష్టంగా మారింది. విద్యార్థుల రవాణాకు ఆటంకం ఈ మార్గంలో స్కూల్ బస్సులు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. రోడ్డుపై...