నేరేడు చర్లలో రోడ్డు ప్రమాదం… మహిళ, మరియు యువకుడు తీవ్ర గాయాలు డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఘటన – ఆసుపత్రికి తరలింపు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 26 నేరేడు చర్ల మున్సిపాల్టీ పరిధిలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న గాజుల పునమ్మ అనే మహిళ , మరో యువకుడు స్కూటీ పై వెళ్తున్న వారిని ధాన్యం లోడుతో హుజూర్ నగర్ నుండి మిర్యాలగూడ వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె తీవ్రంగా గాయపడగా, రక్తస్రావం జరిగింది. అంబులెన్స్ ద్వారా చికిత్సకు తరలింపు ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన మహిళను సమీప ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు...