ఖాళీ కుర్చీల దర్శనం… హుజూర్‌నగర్ ఎంఈఓ కార్యాలయం పరిస్థితి ప్రశ్నార్థకం అధికారుల గైర్హాజరీపై ప్రజల ఆగ్రహంప్రైవేట్ పాఠశాలల ఆగడాలపై పర్యవేక్షణ లేకపోవడం విమర్శలు

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 25 ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని చోట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతున్నాయి. హుజూర్‌నగర్‌లోని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఖాళీ కుర్చీలే కనిపిస్తున్న కార్యాలయం ఎన్ఎస్పీ క్యాంప్ పరిధిలో ఉన్న ఎంఈఓ కార్యాలయానికి ప్రజలు వివిధ పనుల నిమిత్తం వెళ్లినా, అధికారుల జాడ కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో కేవలం ఒక అటెండర్, డెప్యుటేషన్‌పై ఉన్న ఒక సిబ్బంది తప్ప మరెవరూ అందుబాటులో లేరని స్థానికులు చెబుతున్నారు.“ఏ పని మీద వెళ్లినా అధికారులు సీట్లలో ఉండరు. అసలు వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియడం లేదు” అని...