బూరుగడ్డ గ్రామంలో విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమం
డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 25 గ్రామంలో విద్యుత్ సమస్యలపై అధికారులు పరిశీలన బూరుగడ్డ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎస్.ఈ, డీ.ఈ, ఏ.ఈలు గ్రామ సర్పంచ్ యరగాని రాధ నాగరాజుతో కలిసి పర్యటించారు. గ్రామంలో నెలకొన్న వివిధ విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటే విద్యుత్ సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి సమస్యల పరిష్కారం గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటిని సందర్శించి లూజ్ వైర్లు, తక్కువ వోల్టేజ్, మీటర్ సమస్యలు, బిల్లింగ్...