శిలాఫలకం ధ్వంసం… విచారణకు డిమాండ్ రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 21 మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం వద్ద గత గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేశారు. ఉదయం స్థానికులు గమనించి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి ఈ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి కోరారు. పలువురు నాయకుల పాల్గొనడం ఈ సందర్భంగా మాజీ సర్పంచ్...