భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాలు ప్రారంభం – 2027 రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
హైదరాబాద్, మార్చి 21, డైనమిక్ న్యూస్ భారత సైన్యంలో 2027 నియామక సంవత్సరానికి సంబంధించిన అగ్నివీర్ కేటగిరీల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల – తెలంగాణ అభ్యర్థులకు అవకాశం అగ్నివీర్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 13, 2026న విడుదలైంది. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీల్లో నియామకాలు ఈ నియామకాలు క్రింది కేటగిరీలలో నిర్వహించబడతాయి: అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (10వ తరగతి) అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (8వ తరగతి)...