బూరుగడ్డలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు
డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, మార్చి 20 బూరుగడ్డ గ్రామంలోని శ్రీ ఆది శ్రీ లక్ష్మీ నరసింహ వేణుగోపాల దివ్య క్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయం నిండా మంగళవాయిద్యాలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం ప్రత్యేక పూజలు ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి బాలభోగం నివేదించారు. ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని సమర్పించారు. భక్తులకు అర్చనలు పూజల అనంతరం భక్తుల గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. పంచాంగ శ్రవణం నిర్వహణ సాయంత్రం 5 గంటలకు శ్రీ పరాభవ నామ...