హుజూర్‌నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా 25వ వార్డు

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 20 పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హుజూర్‌నగర్ పట్టణంలోని 25వ వార్డులో గల మదీనా మస్జిద్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పాల్గొనడం ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయనతో పాటు 3వ వార్డు కౌన్సిలర్ సులువ చందు, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ, కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు, తెలంగాణ విద్య సమితి రాష్ట్ర అధ్యక్షులు పెండెం తారక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మసీదులు సామాజిక ఐక్యతకు...