మాసాయిపేటలో ఘనంగా ఇఫ్తార్ విందుసర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ – భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులు
డైనమిక్ న్యూస్, మాసాయిపేట, మార్చి 18 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందేశం సమాజంలో సౌహార్ద్రత, సోదరభావం పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు మంచి వేదికగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు శాంతి, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధ రాములు గౌడ్, పోతనపల్లి సర్పంచ్ మాధవరెడ్డి, వార్డు సభ్యులు, పోతంశెట్టిపల్లి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ నాయకుల సమన్వయం మండల...