ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకంతక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధ్యం
పాలకవీడు, మార్చి 17,డైనమిక్ న్యూస్ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడితే తక్కువ ఖర్చుతో లాభదాయకమైన దిగుబడులు పొందవచ్చని పాలకవీడు మండల వ్యవసాయాధికారి బి. కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రైతులకు అవగాహన కార్యక్రమం సోమవారం కోమటికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో స్థానిక వనరులతో చేసే సాగు విధానమే ప్రకృతి వ్యవసాయమని చెప్పారు. నేల సారాన్ని పెంచే పద్ధతి కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త నరేష్ మాట్లాడుతూ సుభాష్ పాలేకర్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ఈ విధానం...