మోతె మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టులుచలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

డైనమిక్ న్యూస్, మోతె, మార్చి 17 తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో మోతె మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ అరెస్టులను సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల వేతనాలు నేరుగా చెల్లిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ మార్చి 2న ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా కాకుండా గ్రామపంచాయతీ నిధుల ద్వారానే వేతనాలు చెల్లించాలని...