హుజూర్ నగర్ మోడల్ కాలనీ ఇళ్ల కేటాయింపుపై వివాదంరీ వెరిఫికేషన్ చేయాలని ప్రజల డిమాండ్
డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, మార్చి 16 హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారులు విడుదల చేసిన డ్రాఫ్ట్ లబ్ధిదారుల జాబితాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలకు న్యాయం జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రాఫ్ట్ జాబితాపై అనుమానాలు శనివారం అధికారులు మొత్తం 805 మంది లబ్ధిదారులతో డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో నిజమైన నిరుపేదలకు స్థానం కల్పించలేదని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. కేవలం అద్దె ఇళ్లలో ఉంటున్న వారికే ప్రాధాన్యత ఇచ్చామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ...