నేరేడుచర్లలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగామండల వ్యాప్తంగా 676 మంది విద్యార్థులు హాజరు

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, మార్చి 14 నేరేడుచర్ల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు మండల విద్యాశాఖ అధికారి బాలు నాయక్ తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 676 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా అందరూ హాజరై పరీక్షను రాసినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి హాజరు నమోదు పరీక్షలకు హాజరు శాతం 100 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరుకావాల్సిన ప్రతి విద్యార్థి కేంద్రాలకు సమయానికి చేరుకుని పరీక్ష రాయడం సంతోషకరమని మండల విద్యాశాఖ పేర్కొంది. బాలురు – బాలికల హాజరు వివరాలు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 352 మంది బాలురు, 324 మంది బాలికలు...